ఉద్యోగులు లాగిన్అయ్యేందుకు సూచనలు

 1. 1వ మెట్టు - ఆధార్‌కార్డు కోసం నమోదు చేసుకోండి
  1. ఎ) ఇప్పటిదాకా మీరు ఆధార్‌కార్డు కోసం నమోదు చేసుకోనట్లయితే, మీకు సమీపంలోని ఆధార్‌కేంద్రానికి వెళ్ళండి. మీ జిల్లా కలెక్టర్‌కార్యాలయం నుంచి, లేదా ఆధార్‌వెబ్‌సైట్‌నుంచి మీ సమీప ఆధార్‌కేంద్రాల వివరాలు తెలుసుకోవచ్చు.
  2. బి) మీరు, మీ కుటుంబసభ్యుల ఆధార్‌నమోదు పూర్తి చేసుకుని, నమోదు సంఖ్యను పొందండి. ఒకవేళ ఆధార్‌కార్డు పొందడంలో ఆలస్యమైనప్పటికీ, ఇహెచ్‌ఎస్‌పథకం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఎలక్ట్రానిక్‌(ఇ) ఫారంలో 28 అంకెలున్న మీ ఎన్‌రోల్‌మెంట్‌సంఖ్యనైనా ఉపయోగించుకోవచ్చు.

   ఇహెచ్‌ఎస్‌ఇ-ఫారమ్‌లో ఎన్‌రోల్‌మెంట్‌సంఖ్యను నమోదు చేయడానికి నిబంధనలు

   Click Here for reference

   1. ఎ) ఆధార్‌నమోదు సమయంలో పొందిన రసీదు (అక్నాలెడ్జ్‌మెంట్‌కార్డు) పై ఎడమవైపున్న 14 అంకెల ఎన్‌రోల్‌మెంట్‌సంఖ్యను గమనించండి. ఈ సంఖ్యను ఇహెచ్‌ఎస్‌ఇ-ఫారమ్‌లో గుర్తింపు వివరాలు (ఐడెంటిఫికేషన్‌డిటెయిల్స్‌) కోరిన చోట నింపండి. ఉదా: మీ ఎన్‌రోల్‌మెంట్‌సంఖ్య 1111/15210/02106 అనుకోండి, దానిని ఇహెచ్‌ఎస్‌ఇ-ఫారమ్‌లో 'గుర్తింపు వివరాలు' కోరిన చోట 11111521002106 అని నింపండి.
   2. బి) రసీదులో కుడివైపు టైమ్‌స్టాంపుతో ఉన్న తేదీని గమనించండి: తేదీ (2 అంకెలు) / నెల (2 అంకెలు) / సంవత్సరం (4 అంకెలు), గంటలు (2 అంకెలు), నిమిషాలు (2 అంకెలు), సెకన్లు (2 అంకెలు), మొత్తం 14 అంకెలు.
   3. సి) ఈ 14 అంకెలనూ కుడివైపు నుంచి ఎడమ వైపుకు మధ్యలో మరే గుర్తులూ లేకుండా పూర్తి వరుససంఖ్యగా మార్చండి. అంటే - తేదీని కుడి నుంచి ఎడమకు ఎలాంటి స్లాష్‌లు లేకుండా, అలాగే టైమ్‌ను కోలన్స్‌లేకుండా కింది విధంగా రాయండి. ఉదా: తేదీ 11/08/2011, సమయం 16:48:44 అనుకోండి; దానిని 20110811164844 అని నమోదు చేయాలి.
   4. డి) ఈ సంఖ్యను 14 అంకెల నమోదు సంఖ్యకు కొనసాగింపుగా నమోదు చేయండి. ఈ 28 అంకెల నమోదు ఐడీ 14 అంకెల నమోదు సంఖ్య, తేదీ, టైమ్‌స్టాంపుతో రూపొందించబడింది. ఉదా: 1111152100210620110811164844
   5. ఇ) ఆధార్‌నమోదు సంఖ్య / ఆధార్‌కార్డును మీరు ఇప్పటికే పొందివున్నట్లయితే ఈ కాలమ్‌ను విడిచిపెట్టండి.
 2. 2వ మెట్టు - సమాచారం రూపొందించడం
  1. స్వయంగా :
   1. ఎ) సమాచారాన్ని రూపొందించడానికి కింద పేర్కొన్న పట్టికలో వున్న నిబంధనావళిని చదవండి.
   2. బి) ఫొటో: ఫొటో: 35 మిల్లీమీటర్ల వెడల్పు, 45 మిల్లీమీటర్ల పొడవుతో (ఐసిఎఓ తరహా) పాస్‌పోర్ట్‌సైజు కలర్‌ఫొటోను జతచేయండి. ఇది 200 కె.బి కంటే తక్కువ సైజుండాలి.
   3. సి) సర్వీస్‌రిజిస్టర్‌(2 పేజీలు): పాత సర్వీస్‌రిజిస్టర్‌అయితే 1&2 పేజీలు, (లేదా) కొత్త సర్వీస్‌రిజిస్టర్‌అయితే 4&5 పేజీలు స్కాన్‌చేసి జతచేయాలి. స్కాన్‌చేసిన డాక్యుమెంట్లలో మీ పేరు, వివరాలు స్పష్టంగా కనిపించేలా వుండాలి.
   4. డి) ఆధార్‌కార్డు / నమోదు రసీదు: మీరు ఆధార్‌కార్డు జత చేయదలచినట్లయితే మీ పేరు, మీ ఆధార్‌సంఖ్య స్పష్టంగా కనిపించేలా స్కాన్‌చేయండి. ఒకవేళ మీరు ఆధార్‌ఎన్‌రోల్‌మెంట్‌రసీదును జతచేయదలచినట్లయితే మీ పేరు, మీ ఆధార్‌ఎన్‌రోల్‌మెంట్‌సంఖ్య స్పష్టంగా కనిపించేలా స్కాన్‌చేయండి.
   5. ఇ) అంగవైకల్య సర్టిఫికెట్‌: మీరు వికలాంగులైనట్లయితే మీ అంగవైకల్య సర్టిఫికెట్‌ను జతచేయండి.
    గమనిక : కంప్యూటర్‌పరిజ్ఞానం లేని ఉద్యోగులు తమ డాక్యుమెంట్లు, ఇతర సమాచారంతో డిడిఓ సంబంధిత అధికారిని నేరుగా సంప్రదించవచ్చు.
  2. (2) ఆధారపడిన కుటుంబసభ్యులు
   1. ఎ) ఫొటో: 45I35 మిల్లీమీటర్ల కొలతలో (ఐసిఎఓ తరహా) పాస్‌పోర్ట్‌ సైజు కలర్‌ఫొటోను జతచేయండి. ఇది 200 కె.బి కంటే తక్కువ సైజుండాలి.
   2. బబి) ఆధార్‌కార్డు / నమోదు రసీదు: మీరు ఆధార్‌కార్డు జత చేయదలచినట్లయితే మీ పేరు, మీ ఆధార్‌సంఖ్య స్పష్టంగా కనిపించేలా స్కాన్‌చేయండి. ఒకవేళ మీరు ఆధార్‌ఎన్‌రోల్‌మెంట్‌రసీదును జతచేయదలచినట్లయితే మీ పేరు, మీ ఆధార్‌నమోదు సంఖ్య స్పష్టంగా కనిపించేలా స్కాన్‌చేయండి.
   3. సి) ఉద్యోగి జీవిత భాగస్వామి కూడా రాష్ట్ర ప్రభుత్వోద్యోగి లేదా సర్వీస్‌పింఛను పొందుతున్నవారైతే దరఖాస్తులోని నిర్ణీత ప్రదేశంలో ఆ వివరాలను నమోదు చేయాలి.
   4. డి) జనన ధృవీకరణ సర్టిఫికెట్‌: ఐదేళ్ళ లోపు వయసున్న కుటుంబసభ్యులున్నట్లయితే వారి జనన ధృవీకరణ సర్టిఫికెట్లను స్కాన్‌చేయండి.
   5. ఇ) కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అంగవైకల్యం వున్నట్లయితే వికలాంగ ధృవీకరణ పత్రాన్ని స్కాన్‌చేయండి.
 3. 3వ మెట్టు - దరఖాస్తును సమర్పించండి
  1. ఎ) వెబ్‌పోర్టల్‌షషష.వష్ట్రట.స్త్రశీఙ.ఱఅ కి లాగిన్‌అవండి
  2. బి) మీ ఉద్యోగి సంఖ్య మీ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌అవుతుంది.
  3. సి) మీ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లతో మీ పేజీలోకి ప్రవేశించండి. మీ దరఖాస్తును అక్కడే సమర్పించండి.
  4. డి) మొదటిసారి లాగిన్‌అవగానే మీ పాస్‌వర్డ్‌ను మార్చుకోండి. (మీ కొత్త పాస్‌వర్డ్‌తప్పనిసరిగా కనీసం 3 నుంచి 8 క్యారెక్టర్లలోపు వుండాలి. అందులో ఒక అక్షరం, ఒక అంకె, ఒక ప్రత్యేక సంకేతం (I/= వంటివి) తప్పనిసరిగా ఉండాలి. పాస్‌వర్డ్‌ను మర్చిపోకుండా జాగ్రత్తపరచుకోండి.
  5. ఇ) వెబ్‌పేజీలో ఇచ్చిన నిబంధనలను చదవండి.
  6. ఎఫ్‌) ఎన్‌రోల్‌మెంట్‌ఫారమ్‌ను తెరిచి, నిబంధనల ప్రకారం దానిని పూర్తిచేయండి. మీ శాఖ ఉన్నతాధికారి, డ్రాయింగ్‌& డిస్బర్సింగ్‌ఆఫీస్‌(డిడిఓ) యూనిట్‌, మీ హోదా తరహాలను దరఖాస్తులోని డ్రాప్‌డౌన్‌మెనూల ద్వారా తెలుసుకోండి. అక్కడ పేర్కొన్న విధంగా మీ సమాచారాన్ని సమర్పించండి; అవసరమైన డాక్యుమెంట్లను జతచేయండి.
  7. జి) మీరు నమోదు చేసిన సమాచారం సరైనదేనని ధృవీకరించుకున్న తరువాతే దరఖాస్తును 'సేవ్' చేయండి.
  8. హెచ్) ఒక్కసారి దరఖాస్తును సమర్పించిన తరువాత ఇక దానిలో ఎలాంటి మార్పులు చేసేందుకూ వీలుపడదు.
  9. ఐ) సమర్పించిన దరఖాస్తును ఒక ప్రింటవుట్‌తీసుకుని, దానిపై మీ సంతకం చేయండి.
  10. జె) మీరు సంతకం చేసిన దరఖాస్తును స్కాన్చేసి, దానిని అప్లోడ్చేయండి.
  11. కె) మీరు సంతకం చేసిన దరఖాస్తును మీ డిడిఓకు సమర్పించండి.
  12. ఎల్‌) ఆన్‌లైన్‌ద్వారా మీరు సమర్పించిన దరఖాస్తు లోని మీ కుటుంబసభ్యుల వివరాలన్నిటికీ మీదే బాధ్యత. ఇందులో ఏదైనా సమాచారం తప్పు అని రుజువైతే క్రమశిక్షణ చర్యలకు గురవుతారని గుర్తించండి.
  13. ఎమ్‌) మీ దరఖాస్తు మీ డిడిఓకి చేరగానే, మీకు ఎస్‌ఎమ్‌ఎస్‌, అక్నాలెడ్జ్‌మెంట్‌ఈమెయిల్‌(మీ ఈమెయిల్‌చిరునామాను దరఖాస్తులో నమోదు చేసినట్లయితే) అందుతాయి.
  14. ఎన్‌) ఒకవేళ మీ దరఖాస్తును మీ డిడిఓ తిరస్కరించినట్లయితే ఆ సమాచారం కూడా మీకు ఎస్‌ఎమ్‌ఎస్‌, ఈమెయిల్‌ద్వారా అందుతుంది.
  15. ఓ) మరోమారు మీ దరఖాస్తును ఎలాంటి తప్పుల్లేకుండా సమర్పించండి.
 4. Step 4: Issue of Health Cards:
  1. శాశ్వత హెల్త్‌కార్డులు
   1. సమర్పించబడిన దరఖాస్తులను ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ట్రస్ట్‌(ఎహెచ్‌సిటి) పరిశీలిస్తుంది.
   2. పరిశీలించబడిన దరఖాస్తులు ఉద్యోగులవైతే డీడీఓలకు పంపించబడతాయి. దరఖాస్తులను ఆమోదించడం, సరైన విధంగా సమర్పించనివాటిని తిరస్కరించే బాధ్యతలను వీరు నిర్వహిస్తారు. డిడిఓలు లేదా ఎస్టిఓ/ఎపిపిఓలు ఈ పరిశీలన బాధ్యతలను నిర్వర్తించలేని పరిస్థితి వున్నట్లయితే వారి లాగిన్లను జిల్లాలోని ఇతర అధికారులకు అప్పగించే అధికారం జిల్లా కలెక్టర్‌కి వుంటుంది.
   3. ఆమోదించబడిన దరఖాస్తులకు సంబంధించిన ప్రతి లబ్దిదారుడికీ ఇచ్చేందుకు ఆరోగ్యకార్డును ముద్రణకు పంపించడం జరుగుతుంది.
   4. ముద్రించబడిన ఆరోగ్యకార్డులు జిల్లాలోని కార్డు జారీ కేంద్రాల (సిఐసీ)కు పంపించడం జరుగుతుంది. శాశ్వతకార్డు ముద్రణ పూర్తయిన వెంటనే లబ్దిదారుల మొబైల్‌ఫోన్లకు ఈ సమాచారం ఎస్‌ఎమ్‌ఎస్‌ద్వారా అందుతుంది.
   5. అనంతరం కుటుంబసభ్యులందరూ తమ నిర్ణీత సిఐసీకి వెళ్ళి, గుర్తింపుగా తమ వేలిముద్రలను సమర్పించి శాశ్వత ఆరోగ్య కార్డులను పొందవచ్చు.
   6. ఇహెచ్‌ఎస్‌ద్వారా అందిన శాశ్వత ఆరోగ్య కార్డులు బయోమెట్రిక్‌వేలిముద్రల ఆధారంగా రూపొందించబడతాయి. జిల్లా కలెక్టర్‌అధికారిక ముద్రతో మీ ఆధార్‌సంఖ్య / ఆధార్‌ఎన్‌రోల్‌మెంట్‌సంఖ్య కూడా ఈ కార్డుపై ముద్రించబడివుంటుంది.
   7. తమ వివరాలు, ఆధార్‌కార్డు సంఖ్యలను సక్రమంగా సమర్పించిన ఉద్యోగులు, పింఛనుదారులకు, వారి దరఖాస్తులు అందిన 30 రోజుల్లోగా సీఐసీల ద్వారా శాశ్వత ఆరోగ్య కార్డులు అందుతాయి.
   8. ఒక్కో రెవిన్యూ డివిజన్‌కూ ఒకటి చొప్పున ఈ సీఐసీలు ఏర్పాటవుతాయి. ఈ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలో ఆ జిల్లా కలెక్టర్‌నిర్ణయిస్తారు.
   9. లబ్దిదారులందరికీ శాశ్వత ఆరోగ్య కార్డులు అందేవరకూ సీఐసీల ద్వారా శాశ్వత బయోమెట్రిక్‌ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ట్రస్టు నిరంతరం కొనసాగిస్తూనే వుంటుంది.
  2. తాత్కాలిక ఆరోగ్య కార్డులు
   1. శాశ్వత ఆరోగ్య కార్డుల జారీకి కొంత సమయం తీసుకుంటుంది. అయితే, లబ్దిదారులకు ఈ పథకం ప్రయోజనాలు వెంటనే అందేందుకు అనుగుణంగా, అర్హులైనవారికి తాత్కాలిక ఆరోగ్యకార్డులను జారీ చేయడం జరుగుతుంది. ఆన్‌లైన్‌ద్వారా సమర్పించబడిన దరఖాస్తులను ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ట్రస్ట్‌పరిశీలన పూర్తికాగానే లబ్దిదారుల లాగిన్లలోనే ఒక తాత్కాలిక ఆరోగ్యకార్డును జతచేయడం జరుగుతుంది. ఇంటర్‌నెట్‌సాయంతో లబ్దిదారులు ఈ డిజిటల్‌కార్డులను పొంది, వాటిని ప్రింట్‌తీసుకుని, లామినేషన్‌చేయించుకుని తాత్కాలికంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే, మీసేవ కేంద్రాల్లో (డైరెక్టర్‌, ఇఎష్‌డి, ఐటీ&సీ పేర్కొన్న ప్రకారం) రు.25కి మించకుండా రుసుము చెల్లించి కూడా ఈ తాత్కాలిక ఆరోగ్యకార్డులను పొందవచ్చు.
   2. తాత్కాలిక ఆరోగ్యకార్డులు 90 రోజుల వరకూ, లేదా శాశ్వత ఆరోగ్య కార్డు వచ్చే వరకూ, లేదా డీడీఓలు వారి దరఖాస్తులను తిరస్కరించేవరకూ, లేదా ఏది తక్కువ గడువు అయితే అంతవరకూ చెల్లుబాటవుతాయి.
   3. తాత్కాలిక ఆరోగ్యకార్డును పొందినవారందరూ ఎంపిక చేయబడిన ఆసుపత్రుల్లో చికిత్సలు పొందేందుకు అర్హులు. ఈ కార్డు వుంటే ఈ ఆసుపత్రుల్లో చికిత్సను వెంటనే ప్రారంభిస్తారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ట్రస్టు ఎంపిక చేసిన ఆసుపత్రుల వివరాలను షషష.వష్ట్రట.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో గమనించవచ్చు.
ఎన్‌రోల్‌మెంట్‌దరఖాస్తును నింపేందుకు కావల్సిన సమాచారం
వ్యక్తిగత వివరాలు
ఉద్యోగి సంఖ్య * డీటీఏ ఇచ్చిన ఉద్యోగి సంఖ్యను నమోదు చేయండి.
పేరు * మీ సర్వీసు రిజిస్టర్‌లో నమోదైన ప్రకారం మీ పేరును రాయండి.
ఆధార్‌కార్డు సంఖ్య * మీ కార్డుపై నమోదైన ప్రకారం మీ ఆధార్‌కార్డు సంఖ్యను రాయండి.
ఆధార్‌నమోదు సంఖ్య * ఆధార్‌నమోదు కోసం వెళ్ళిన సమయంలో ఇచ్చిన ఆధార్‌నమోదు పత్రంపై వున్న సంఖ్యను తెలపండి.
జనన తేదీ* మీ సర్వీస్‌రిజిస్టర్‌లో నమోదైన ప్రకారం మీ జనన తేదీని తెలపండి.
లింగం * మీ లింగం (స్త్రీ / పురుషులు) తెలపండి.
వైవాహిక హోదా * మీ ప్రస్తుత వైవాహిక హోదా గురించి తెలపండి.
సామాజిక వర్గం * ఎస్.సి, ఎస్.టి, బీసీ, మైనారిటీలు తదితర కేటగిరీల నుంచి మీ సామాజిక వర్గాన్ని ఎంచుకోండి.
అంగవైకల్యం వివరాలు* మీరు వికలాంగులయినట్లయితే మీ అంగవైకల్యం తరహాను, అంగవైకల్య శాతాన్ని ఎంచుకోండి.
జాతీయత * మీ జాతీయతను తెలియజేయండి.
సంప్రదింపు వివరాలు
చిరునామా* మీ నివాసపు పూర్తి చిరునామా, ప్రాంతం, ఈమెయిల్‌చిరునామా, మొబైల్‌ఫోన్‌నెంబర్లను తెలియజేయండి. మీ ఈమెయిల్‌, ఫోన్‌నెంబర్లు స్పష్టంగా అర్థమయ్యేలా రాయండి. మీకు భవిష్యత్‌సంప్రదింపులన్నీ వీటి ద్వారానే జరుగుతుంది.
గుర్తింపు చిహ్నాలు
రేషన్కార్డు సంఖ్య మీకు రేషన్‌కార్డున్నట్లయితే దాని సంఖ్యను తప్పనిసరిగా నమోదు చేయండి. మీ వివరాలను సులభంగా కనుగొనేందుకు రేషన్‌కార్డు సంఖ్య కీలకంగా ఉపయోగపడుతుంది.
గుర్తింపు చిహ్నాలు * మీ శరీరంపై కనిపించేలా వున్న రెండు గుర్తింపు చిహ్నాలను తెలియజేయండి
పోస్టింగ్వివరాలు
శాఖాధిపతి * మీ శాఖాధిపతి పేరు రాయండి
జిల్లా* మీరు ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాను తెలియజేయండి
డిడిఓ కోడ్* ప్రస్తుతం మీరు వేతనం పొందుతున్న డీటీఏ నుంచి మీ డిడిఓ కోడ్ను పొందండి.
ఉద్యోగ హోదా * మీ ప్రస్తుత ఉద్యోగ హోదా గురించి తెలియజేయండి (ఉదా: సివిల్‌అసిస్టెంట్‌సర్జన్‌, కామాటి, డ్రయివర్‌మొ||).
వేతనం వివరాలు
ప్రస్తుత వేతనం మీ ప్రస్తుత వేతనం వివరాలు తెలపండి.
జతపరచాల్సినవి
సర్వీస్‌రిజిస్టర్‌* మీ సర్వీస్‌రిజిస్టర్‌లోని మొదటి రెండు పేజీలు స్కాన్‌కాపీలు.
ఫొటో* మీ, మీ కుటుంబసభ్యులు ప్రతి ఒక్కరివీ - ఐసిఎఓ తరహాలో ముద్రించిన పాస్‌పోర్ట్‌సైజు కలర్‌ఫొటోలను జతచేయండి. పాస్‌పోర్ట్‌కోసం దరఖాస్తు చేసేటప్పుడు పొందే సైజ్‌ఫొటో ఇదే. మీ అవసరాన్ని ఫొటోగ్రాఫర్‌కి ముందుగానే తెలియజేసి, ఇదే సైజు ఫొటోను పొందండి. ఫొటో సైజు 35 మిల్లీమీటర్ల వెడల్పు, 45 మిల్లీమీటర్ల పొడవుతో వుండాలి.
ఆధార్‌కార్డు * ఆధార్‌కార్డు లేదా ఆధార్‌కార్డు నమోదు రసీదు స్కాన్‌చేసిన కాపీని జతచేయండి. డాక్యుమెంట్‌లో అక్షరాలు స్పష్టంగా కనిపించేలా వుండాలి.
జననతేదీ ధృవీకరణ పత్రం * కుటుంబసభ్యుల్లో ఎవరైనా అయిదేళ్ళ లోపు వయసున్నవారైవుండి, వారికి ఆధార్‌కార్డు లేనట్లయితే వారి జననతేదీ సర్టిఫికెట్లను స్కాన్‌చేసి వాటిని సమర్పించవచ్చు.
అంగవైకల్యం సర్టిఫికెట్* మీరు వికలాంగులయినట్లయితే మీ అంగవైకల్య సర్టిఫికెట్‌ను స్కాన్‌చేసి సాఫ్ట్‌కాపీని జతచేయాలి.
కుటుంబసభ్యుల వివరాలు
పేరు, బాంధవ్యం, ఆధార్‌సంఖ్య * మీ కుటుంబసభ్యులతో మీ బాంధవ్యాల్ని తెలియజేస్తూ, వారందరి ఆధార్‌కార్డు సంఖ్యలను జతచేయండి.
జీవిత భాగస్వామి ఉద్యోగి ఐడీ / పెన్సనర్ఐడీ * మీ జీవిత భాగస్వామి రాష్ట్రప్రభుత్వ ఉద్యోగి / పింఛనుదారు అయినట్లయితే వారి ఉద్యోగి గుర్తుంపు ఐడీ / పింఛను ఐడీని తెలియజేయండి.
అంగీకారపత్రం
మీ సంతకంతో వున్న దరఖాస్తుతోపాటు అంగీకారపత్రం. * ఇ-ఫారమ్‌లో మీ వివరాలన్నీ నమోదు చేసిన తరువాత దానిని ఒక ప్రింట్‌తీసుకుని, దానిపై సంతకం చేసి, ఆ ఫారాన్ని స్కాన్‌చేసి సాఫ్ట్‌కాపీని తయారుచేసుకోవాలి. అంగీకార పత్రం ద్వారా మీరు .. 1) మీ కుటుంబసభ్యులందరి ఆధార్‌కార్డు వివరాలను జతచేసి, దానిని ఎహెచ్‌సీటీకి బదిలీ చేసినట్లు అంగీకరించినట్లు, 2) అర్హతలేని వారిని కుటుంబసభ్యులుగా నమోదు చేయడం వంటి చర్యలకు పాల్పడితే తీసుకోగల క్రమశిక్షణ చర్యలకు బాధ్యులవుతారని అంగీకరించినట్లు 3) సర్వీస్‌రిజిస్టర్‌లో పేర్కొన్న సమాచారం అంతా మీ మనస్సాక్షి ప్రకారం నిజమేనని సమ్మతించినట్లు అవుతుంది.